Games

 

28 May 2021

శ్రీ శంకరుల చరిత్ర

0 comments

  *జగద్గురు శ్రీ శంకరాచార్యుల వారి సంక్షిప్త జీవిత కథామృత గానము*


-బ్రహ్మచారి విజయానంద

  శ్రీ శుకబ్రహ్మాశ్రమము


శ్రీ శంకరాచార్యులట - అద్వైత జ్ఞానులట 

పరమశివుని అంశమట - అవతారమూర్తియట 

కేరళ దేశమట - 

మరి కాలడి గ్రామమట 

ఆర్యాంబ తల్లి యట - 

శివగురు తండ్రి యట 

మహేశుని వరమట - శంకరులు పుట్టిరట 

ఏడేళ్ళ వయస్సట - వేదములు నేర్చెనట 

తల్లి స్నానము కొరకట - నదినే రప్పించెనట 

సర్వమత సారమట - శంకరులు ఎరిగిరట 

ఎనిమిదేళ్ళ వయస్సట - భిక్షాటనకెళ్ళెనట 

లక్ష్మీ స్తోత్రం చేసెనట - కనకధార కురిసెనట 

నదిలోని కెళ్ళెనట - మొసలియే పట్టెనట 

దీక్షనే కోరెనట - 

తల్లి అనుమతించెనట

మొసలి పారిపోయెనట - తల్లికి మ్రొక్కెనట

తీర్థయాత్ర చేసెను - గురువుకై వెదికెనట

గోవింద గురుని కలిసెనట - సన్న్యాసిగ మారెనట

బ్రహ్మసూత్రాలు నేర్చెనట - మహావాక్యాలు వినెనట 

ఉపనిషత్తులు చదివెనట - చూడామణిని వ్రాసెనట 


నర్మదకు వరదలట - 

నీరు గుహలోని కొచ్చెనట 

కమండలము పెట్టెనట - వరదనంతా పట్టెనట 

అది ఎరిగి గురువు అట - శంకరుని మెచ్చెనట 

కాశీకి వెళ్ళిరట - పరమగురుని చూచెనట 

గౌడపాదాచార్యులట - శంకరుని చూచిరట 

ప్రస్థాన త్రయమిచ్చెనట - భాష్యమునే అడిగెనట 


శంకరులే వ్రాసిరట - ఓమ్‌ ఓమ్‌ ఓమ్‌ 

సాధనెంతొ చేసిరట - జీవన్ముక్తులయ్యిరట 


స్వగ్రామము కేగెనట - 

తల్లి కిచ్చె మోక్షమట 


గురుపీఠము చేరెనట - వారసుడు అయ్యెనట 

సానందుడు శిష్యుడట - ఆత్మబోధ నిచ్చెనట 

నది కావల నిలిచెనట - సానందుని పిలిచెనట 

అడుగడుగున పద్మమట - పద్మపాదుడయ్యెనట 


విద్యార్థిని చూచెనట - “భజగోవిందము”నిచ్చెనట

 పంచముడు వచ్చెనట - పరమశివుడే అతడట 


మనీషా పంచకమట - శంకరులే చెప్పిరట 

పదునారవ ఏడు అట - వృద్ధముని వచ్చెనట 


వాదనకు మెచ్చెనట - ఆయుస్సును పెంచెనట 

వ్యాసుడే అతడట - అదృశ్యమైపోయెనట 


మూగవాడు వచ్చెనట - బోధరూపుడన్నాడట హస్తామలకుడయ్యెనట - శిష్యునిగ చేరెనట 

కౌశాంబి కేగెనట - 

మృతజీవుని లేపెనట 

చదువురాని వ్యక్తియట - తోటకమే చెప్పెనట 

తోటకాచార్యుడట - శంకరుల శిష్యుడట 

మండనుని కలిసెనట - విశ్వరూపనాముడట 

భారతి జడ్జి యట - వాదము కొనసాగెనట 


మండనుడు ఓడెనట - భారతి ప్రశ్నించెనట 

శంకరులు కోరిరట - గడువునే అడిగిరట 

శంకరులు వెళ్ళిరట - మృతరాజులో చేరిరట 

కామజ్ఞాన మెరిగెనట - అమర శతకం వ్రాసెనట 

మరల తిరిగి వచ్చెనట - భారతి నోడించెనట 


మండనుడు శిష్యుడట - సురేశ్వరాచార్యుడట 


“నైష్కర్మ్య సిద్ధి”నిచ్చెనట - ఓమ్‌. ఓమ్‌. ఓమ్‌ 

శంకరుల వెనువెంట - భారతి నడిచెనట 

షరతునే పెట్టెనట - వెనుకకు చూడకుమనెనట 

కప్పబాధనొందెనట - పాము పడగ గొడుగు అట 

వింత చూడుమన్నాడట - వెనుకకు తిరిగెనట 

భారతి ఆగెనట - 

శారదా పీఠమయ్యెనట 

శిష్యులతో కూడి అట - కాశ్మీరం చేరెనట 

సర్వజ్ఞ పీఠమట - పండితుల కొలువు అట 

చతుష్షష్టి కళలకట - చతుష్షష్టి ప్రశ్నలట

సమాధానమిచ్చెనట - పీఠము మరి ఎక్కెనట 

సర్వజ్ఞుడయ్యెనట - 

ఓమ్‌. ఓమ్‌. ఓమ్‌ 

కాపాలికుడు వచ్చెనట - బలిదానం కోరెనట 

కత్తిని పైకెత్తెనట - పద్మపాదుడు చూచెనట 


నరసింహుడు అయ్యెనట - కాపాలికుని చంపెనట 

నరసింహస్తోత్రమట - శంకరులే చేసిరట 

శంకరుని బోధ అట - వేదాంత సారమట 

బ్రహ్మయు నేనే అట - విష్ణువు నేనే అట 

శివుడున్నూ నేనే అట - అంతయు నేనే అట 

జాగ్రదవస్థ మిథ్యయట - స్వప్నమూ మిథ్యయట 

సుషుప్తి మిథ్య యట - నీవు మాత్రం సత్యమట 


కుండయే పగులునట - ఆకాశం పగులదట 

దేహమే రాలునట - 

నీ ఆత్మరాలదట 


శివుడే ఆత్మయట - 

గౌరి దేవి బుద్ధియట 

ప్రాణాలే మిత్రులట - దేహమే గృహమట 

నడకయే ప్రదక్షిణమట - నిద్రయే సమాధియట 

నిత్య కర్మలన్నియట - 

శ్రీ శివ పూజలట 


పీఠాలు నాలుగట - 

నలుదిశల ఉన్నవట 

శారదా పీఠమట - ద్వారకా క్షేత్రమట 

వేదము సామమట - “తత్త్వమసి” 

వాక్యమట సురేశ్వరుడు గురువట - గోమతి తీర్థమట 

గోవర్ధన మఠము అట - జగన్నాథ క్షేత్రమట 

వేదము ఋక్కుఅట - “ప్రజ్ఞానం బ్రహ్మ”మట 

గురువు పద్మపాదుడట - తీర్థము సాగరమట 

జ్యోతిర్మఠమట - బదరీనాథ క్షేతమట 

వేదము అథర్వమట - “అయమాత్మా బ్రహ్మ”మట 

తోటకాచార్యుడట - అలకనంద తీర్థమట 

శృంగేరి మఠమట - రామేశ్వరం క్షేత్రమట 

యజుర్వేదమట - “అహంబ్రహ్మాస్మి” యట 

గురువు పృథివీధరుడట - తుంగభద్ర తీర్థమట 

శంకరుల వయస్సట - ముప్పది రెండుయట 


కేదారనాథ్‌ చేరిరట - శివరూపము నొందిరట 

స్వాత్మరూపులైరి అట - ఆనందమేవారు అట. 


*ఓం మంగళం శంకరాచార్యాయ మహనీయ గుణాత్మనే । 

సర్వలోక శరణ్యాయ - సాధురూపాయ మంగళమ్‌ ॥*

0 comments:

Post a Comment