Games

 

28 May 2021

గుర్వష్టకము

0 comments

ఓమ్

గుర్వష్టకము అనువాదము..

(బ్రహ్మచారి విజయానంద) 


ఆదిశంకరుల గుర్వష్టకం 

శిష్యులపాలిటి భక్తిదాయకం,

భక్తులపాలిటి జ్ఞానదాయకం,

జ్ఞానులపాలిటి మోక్షదాయకం,

ముక్తులపాలిటి ఆనందదాయకం.


గురుపాదభక్తి లేకయున్నచో, 

సద్గురుభక్తి లేకయున్నచో 

ఏమి లాభము?! 

ఏమి లాభము?! 


1. దేహము సుందరమైననుగాని 

     సతి రూపవతి అయిననుగాని 

     గొప్ప కీర్తిని పొందినగాని 

     కొండంత ధనముమ బడసినగాని   ౹౹గురుపాద॥ 


2.  భార్య, బంధువులున్ననుగాని 

     ధనము, గృహము యున్ననుగాని 

     పుత్రపౌత్రులు కలిగినగాని              ౹౹గురుపాద॥


3.  చతుర్వేదములు నేర్చినగాని 

     శాస్త్రజ్ఞానము పొందినగాని 

     కవిత్వమెంతో చెప్పినగావి 

     గద్య, పద్యములు వ్రాసినగాని       ౹౹గురుపాద౹౹


4.  విదేశములన్నీ తిరిగినగాని 

     స్వదేశమెంతో మెచ్చినగాని 

     ఆచారవంతుడు ఆయిననుగాని    ౹౹గురుపాద॥ 


5. చక్రవర్తులు మ్రొక్కినగాని 

     రాజుల సేవను పొందినగాని          ౹౹గురుపాద౹౹


6. దానకర్ణుడని పేరొందినగాని 

    అన్నివస్తువులు పొందినగాని 

    పొందని వస్తువు లేకున్నగాని          ౹౹గురుపాద౹౹


7. యోగభోగములు లేకున్నగాని 

     వాహనరాశి లేకున్నగాని 

     కాంతాకనకము వీడినగాని           ౹౹గురుపాద౹౹


8. అరణ్యవాసము చేసినగాని 

    స్వగృహమందున యున్ననుగాని 

    కోరికలేవియు లేకున్నగాని 

    దేహాభిమానము పోయినగాని 

    మోక్షాపేక్ష యున్ననుగాని               ౹౹గురుపాద౹౹


9.  రత్నరాశిని పొందినగాని 

     విషయసుఖమును బడసినగాని    ౹౹గురుపాద౹౹


10. సద్గురుభక్తి కలిగిన నరుడే 

       ధన్యజీవుడు ధన్యజీవుడు 


11. ఆదిశంకరుల గుర్వష్టకము 

      చదివిన వినిన పలికిన తలచిన 

      సంసారబాధలు తొలగిపోవును 

      భగవత్కృపయు కలిగి తీరును.

*****************

*****************

*****************

గుర్వష్టకం మూలము...

(శ్రీ ఆదిశంకరులు)


శరీరం సురూపం తథా వా కళత్రం

యశశ్చారు చిత్రం ధనం మేరుతుల్యమ్ |

మనశ్చేన్న లగ్నం గురోరంఘ్రిపద్మే

తతః కిం తతః కిం తతః కిం తతః కిమ్ || 1 ||



కళత్రం ధనం పుత్రపౌత్రాది సర్వం

గృహం బాంధవాః సర్వమేతద్ధి జాతమ్ |

మనశ్చేన్న లగ్నం గురోరంఘ్రిపద్మే

తతః కిం తతః కిం తతః కిం తతః కిమ్ || 2 ||


షడంగాదివేదో ముఖే

 శాస్త్రవిద్యా

కవిత్వాది గద్యం సుపద్యం కరోతి |

మనశ్చేన్న లగ్నం గురోరంఘ్రిపద్మే

తతః కిం తతః కిం తతః కిం తతః కిమ్ || 3 ||


విదేశేషు మాన్యః స్వదేశేషు ధన్యః

సదాచారవృత్తేషు మత్తో న చాన్యః |

మనశ్చేన్న లగ్నం గురోరంఘ్రిపద్మే

తతః కిం తతః కిం తతః కిం తతః కిమ్ || 4 ||


క్షమామండలే భూపభూపాలబృందైః

సదా సేవితం యస్య పాదారవిందమ్ |

మనశ్చేన్న లగ్నం గురోరంఘ్రిపద్మే

తతః కిం తతః కిం తతః కిం తతః కిమ్ || 5 ||


యశో మే గతం దిక్షు దానప్రతాపాత్

జగద్వస్తు సర్వం కరే యత్ప్రసాదాత్ |

మనశ్చేన్న లగ్నం గురోరంఘ్రిపద్మే

తతః కిం తతః కిం తతః కిం తతః కిమ్ || 6 ||


న భోగే న యోగే న వా వాజిరాజౌ

న కాంతాముఖే నైవ విత్తేషు చిత్తమ్ |

మనశ్చేన్న లగ్నం గురోరంఘ్రిపద్మే

తతః కిం తతః కిం తతః కిం తతః కిమ్ || 7 ||


అరణ్యే న వా స్వస్య గేహే న కార్యే

న దేహే మనో వర్తతే మే త్వనర్ఘ్యే |

మనశ్చేన్న లగ్నం గురోరంఘ్రిపద్మే

తతః కిం తతః కిం తతః కిం తతః కిమ్ || 8 ||


గురోరష్టకం యః పఠేత్పుణ్యదేహీ

యతిర్భూపతిర్బ్రహ్మచారీ చ గేహీ |

లభేద్వాంఛితార్థం పదం బ్రహ్మసంజ్ఞం

గురోరుక్తవాక్యే మనో యస్య లగ్నమ్ ||


॥ ఇతి శ్రీ శంకరాచార్య కృతం గుర్వష్టకం సమ్పూర్ణమ్ ॥

----

0 comments:

Post a Comment