Games

 

28 Nov 2023

శ్రీమలయాళ మహర్షి - పుస్తకం

0 comments

 

                                                          పునర్ముద్రిత గ్రంథము


పూజ్యశ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారు రచించిన గ్రంథము శ్రీ మలయాళ మహర్షి

భగవంతుడు భగవంతుని గూర్చి వ్రాసిన  దివ్యచరిత.








Read more...

4 Mar 2023

25వ ఆరాధనోత్సవ ఆహ్వానము - 05-4-2023 నుండి 09-4-2023

0 comments

 పూజ్య శ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారి 25వ ఆరాధనోత్సవ ఆహ్వానము.....


గురుదేవులు పూజ్యశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారి 25వ పుణ్యారాధన, 110వ జన్మ దినోత్సవము. మరియు 73వ ఆశ్రమ వార్షికోత్సవము  05-4-2023 నుండి 09-4-2023 వరకు జరుగును.

___

పవిత్రాత్మ స్వరూపులారా! శ్రీ శుకబ్రహ్మాశ్రమ స్థాపకులు, గీతామకరంద రచయిత, విఖ్యాత గీతోపన్యాసకులగు శ్రీగురుదేవులు పరమపూజ్య శ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారి ఇరువది ఐదవ పుణ్యారాధన శోభకృత్ నామ సంవత్సర చైత్ర శుద్ధ చతుర్దశి బుధవారం 5-4-2023 వ తేదీన, 

అట్లే శ్రీస్వాములవారి 110వ జన్మదినోత్సవం ఆదివారం 9-4-2023 తేదీలందు జరుపబడును.


ఈ కార్యక్రమములు

పూజ్యశ్రీశ్రీశ్రీ విద్యాస్వరూపానందగిరి స్వాములవారి సన్నిధిలో,

పూజ్యశ్రీశ్రీశ్రీ సంపూర్ణానందగిరి స్వాములవారి అధ్యక్షతన జరుగును.


విశేష కార్యక్రమం.....

05-04-2023వ తేదీన 25 మంది యతీశ్వరులకు పూజ జరుగును.

ఈ కార్యక్రమములో పాల్గొను మహాత్ములు.....

01) పూజ్యశ్రీ పరిపూర్ణానందగిరి స్వాములవారు,

శ్రీవ్యాసాశ్రమ పీఠాధిపతులు, శ్రీవ్యాసాశ్రమం.

02) పూజ్యశ్రీ దండి నిర్మలానందగిరి స్వాములవారు (శ్రీ అష్టలక్ష్మీ పీఠాధిపతులు, తెనాలి).

03) పూజ్యశ్రీ దివ్యచైతన్య స్వాములవారు (రాజరాజేశ్వరి మఠం, కాశి).

04) పూజ్యశ్రీ దేవానందగిరి స్వాములవారు (గంగామహల్, కాశి).

05) పూజ్యశ్రీ సుందరానంద సరస్వతి స్వాములవారు (కార్తికేయ ఆశ్రమం, ఋషీకేశ్).

06) పూజ్యశ్రీ డా|| కరిబసవ రాజేంద్ర మహా స్వాములవారు,

(ఉత్తర పీఠాధిపతులు, గవి మఠం, ఉరవకొండ).

 07) పూజ్యశ్రీ సుకృతానందస్వాములవారు, (రామకృష్ణ మిషన్ ఆశ్రమం, తిరుపతి).

 08) పూజ్యశ్రీ స్వస్వరూపానందగిరి స్వాములవారు, (వసిష్ఠాశ్రమాధిపతులు, శ్రీనివాసమంగాపురం).

09) పూజ్యశ్రీ పరిశుద్ధానందగిరి స్వాములవారు (పరాశరాశ్రమాధిపతులు, హైదరాబాద్). 

10) పూజ్యశ్రీ శ్రీ హరితీర్థ స్వాములవారు (శ్రీసత్యానందాశ్రమాధిపతులు, ఇనమడుగు). 

11) పూజ్యశ్రీ విష్ణుసేవానందగిరి స్వాములవారు(శ్రీ మలయాళస్వామి గీతామందిర అధిపతులు, కరీంనగర్).

12) పూజ్యశ్రీ ప్రణవానందగిరి స్వాములవారు (ఉమామహేశ్వర పీఠాధిపతులు, లత్తవరం). 

13) పూజ్యశ్రీ శంకరానందగిరి స్వాములవారు (శ్రీబుచ్చిదాస గీతాశ్రమాధిపతులు, యాదగిరిగుట్ట). 

14) పూజ్యశ్రీ కృష్ణానందపురి స్వాములవారు (వాసవీక్షేత్రాధిపతులు, పెనుగొండ). 

15) పూజ్యశ్రీ ప్రసన్నానందగిరి స్వాములవారు, ఆనందాశ్రమాధిపతులు గండిపాళెం). 

16) పూజ్యశ్రీ ప్రణవాత్మానంద సరస్వతి స్వాములవారు (ఆర్షవిద్యాపీఠం, హైదరాబాద్). 

17) పూజ్యశ్రీ సర్వాత్మానందగిరి స్వాములవారు (శ్రీశుకబ్రహ్మాశ్రమం, శ్రీకాళహస్తి).

18) పూజ్యశ్రీ శివానందగిరి స్వాములవారు (జగన్మాతాశ్రమాధిపతులు, రాచపాలెం).

19) పూజ్యశ్రీ పరావిద్యానందగిరి స్వామినివారు (యాజ్ఞవల్యాశ్రమాధిపతులు, యాచారం).

20) పూజ్యశ్రీ స్వప్రకాశానంద సరస్వతి స్వాములవారు (చిన్మయమిషన్, శ్రీకాళహస్తి).

21) పూజ్యశ్రీ ప్రతిభానందగిరి స్వామినివారు (శ్రీభూమానందాశ్రమాధిపతులు, గండిక్షేత్రం).

22) పూజ్యశ్రీ యోగిని చంద్రకాళీ ప్రసాద మాతాజీవారు (శ్రీ కాళీవనాశ్రమాధిపతులు, నంబూరు).

23) పూజ్యశ్రీ శివానంద సరస్వతి మాతాజీ వారు (చైతన్య తపోవనాధిపతులు, తాడేపల్లి).

24) పూజ్యశ్రీ గురుచరణానందగిరి స్వామినివారు(శ్రీశంకరానందగిరి గురు సేవాశ్రమాధిపతులు, కొక్కరచేడు).

24) పూజ్యశ్రీ అనంతానందగిరి స్వామిని వారు (అమ్మఒడి కుటీరం, కామవరం).

____

మహామహోపాధ్యాయ, డా॥ సముద్రాల లక్ష్మణయ్యగారికి సన్మానము.

తిరుపతి భక్తి సంగీత శిరోమణి డా॥ ద్వారం లక్ష్మి గారు భక్తిసంగీత కచ్చేరి, తిరుపతి.

___

ముఖ్య అతిథులు : శ్రీ బియ్యపు మధసూదన రెడ్డిగారు, ఎం.ఎల్.ఎ., శ్రీకాళహస్తి.

శ్రీ అంజూరు తారక శ్రీనివాసులు గారు, చైర్మెన్, శ్రీకాళహస్తీశ్వర దేవస్థాన ట్రస్టుబోర్డు.

___

విశేష కార్యక్రమములు


5-4-2023 

బుధవారం అధిష్ఠానమందిరంలో శ్రీవారికి అభిషేకము, అర్చన, యతిపూజ.


6-4-2023 

గురువారం...

ఆశ్రమవార్షికోత్సవము.

శ్రీకాళహస్తిలో శ్రీగురుదేవుల పేరిటగల మూడు కళాశాలలలో సర్వప్రథమంగా వచ్చిన విద్యార్థులకు బహుమతుల ప్రదానము.


 7-4-2023 

శుక్రవారము త్రినేత్రవైద్యాలయం, భక్తకన్నప్ప ఉచిత కంటి ఆస్పత్రి వార్షికోత్సవము.

ఆశ్రమ కార్యదర్శి నివేదిక: శ్రీ కె. ఈశ్వర్ గారు

కంటి ఆపరేషన్లు అయిన వారికి కంటి అద్దాల ప్రదానము, డాక్టర్లకు సన్మానము. 


8-4-2023 

శనివారము సద్గురు సర్వసేవా ట్రస్టు వార్షికోత్సవము.

 యోగాసనాల సర్టిఫికెట్ల ప్రదానము.


9-4-2023 

ఆదివారము 

శ్రీ స్వాములవారి జన్మదినోత్సవము.

 ఉదయం 10.30 గం||లకు శ్రీవారిమూర్తికి అభిషేకము మరియు పాదుకాపూజ.

మహాత్ములకు సన్మానం.

___

ప్రతిరోజు కార్యక్రమములు.....

ఉదయం: 5.00గం||లకు సుప్రభాతము, ధ్యానము.

5.30 - 6.00 గం||ల వరకు మంత్రజపము.

6.00 - 7.30గం||ల వరకు గీతాపారాయణము.

9.00 - 11.00 గం||ల వరకు మహాత్ముల ప్రవచనములు.

11.00 - 12.00 గం||ల వరకు పూజ, హారతి.


మధ్యాహ్నం : 3.00-4.00 గం||ల వరకు భజన, సంకీర్తన.

1. శ్రీసత్యసాయి సేవాసమితి వారి భజన (శ్రీకాళహస్తి).

2. చాముండీశ్వర భక్తబృందం వారి సంకీర్తన (భాస్కరపేట, శ్రీకాళహస్తి) 

3. శ్రీహరినామ సంకీర్తన మండలి వారి భజన (పద్మశాలిపేట,శ్రీకాళహస్తి)


 సాయంకాలం : 4.00-7.00 గం||ల వరకు మహాత్ముల ప్రవచనాలు.

ఈ కార్యక్రమములో భక్తులందరు పాల్గొని ఆనందింతురుగాక!


ఓమ్ తత్ సత్

ఓమ్

శ్రీ శుకబ్రహ్మాశ్రమ భక్తబృందము ఆరాధనోత్సవ నిర్వహణ సమితి

___

*ముఖ్య గమనిక : ఈ కార్యక్రమములో పాల్గొనువారందరు తప్పక మాస్కులు ధరించవలయును.


హరి ఓమ్










Read more...