ఆహ్వానము
ఓం సచ్చిదానన్దరూపం తం సర్వశాస్త్రార్థ బోధకమ్ | విద్యాప్రకాశ నామానం సద్గురుం ప్రణమామ్యహమ్ |
శ్రీగురుదేవులు పూజ్యశ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారి ఇరువది ఆరవ పుణ్యారాధన.
111 వ జన్మ దినోత్సవము మరియు 74వ ఆశ్రమ వార్షికోత్సవము 22-4-2024 : 26-4-2024 తేదీలందు.
**********
శ్రీ శుకబ్రహ్మాశ్రమ స్థాపకులు, గీతామకరంద రచయిత, విఖ్యాత గీతోపన్యాసకులగు గురుదేవులు పరమపూజ్య శ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారి ఇరువది ఆరవ పుణ్యారాధన క్రోధి నామ సంవత్సర చైత్ర | శుద్ధ చతుర్దశి సోమవారం అనగా 22-4-2024వ తేదీన, అట్లే శ్రీస్వాములవారి 111వ జన్మదినోత్సవం చైత్ర బహుళ తదియ శుక్రవారం 26-4-2024 తేదీన, మరియు శ్రీ శుక బ్రహ్మాశ్రమ 74వ వార్షికోత్సవము 23, 24, 25 తేదీలందు జరుగును.
ఈ కార్యక్రమములు
పూజ్యశ్రీశ్రీశ్రీ విద్యాస్వరూపానందగిరి స్వాములవారి సాన్నిధ్యంలో (శ్రీశుకబ్రహ్మాశ్రమ పీఠాధిపతులు),
పూజ్యశ్రీశ్రీశ్రీ సంపూర్ణానందగిరి స్వాములవారి సర్వాధ్యక్షతన (శ్రీ శుకబ్రహ్మాశ్రమ ఉత్తర పీఠాధిపతులు) జరుగును.
పవిత్రాత్మ స్వరూపులారా!
ఈ కార్యక్రమాలలో ప్రసంగించువారు :-
పూజ్యశ్రీ డా॥ కరిబసవ రాజేంద్ర స్వాములవారు
(ఉత్తర పీఠాధిపతులు, గవి మఠం, ఉరవకొండ),
పూజ్యశ్రీ వినిశ్చలానంద స్వామీజీ మహారాజ్ (కార్యదర్శి, రామకృష్ణమిషన్, విజయవాడ),
పూజ్యశ్రీ శ్రీహరి తీర్థ స్వాములవారు (శ్రీసత్యానందాశ్రమాధిపతులు, ఇనమడుగు),
పూజ్యశ్రీ శంకరానందగిరి స్వాములవారు (బుచ్చిదాస గీతాశ్రమాధిపతులు, యాదగిరిగుట్ట),
పూజ్యశ్రీ సర్వాత్మానందగిరి స్వాములవారు
(శ్రీశుకబ్రహ్మాశ్రమము, శ్రీకాళహస్తి),
పూజ్యశ్రీ పరావిద్యానందగిరి స్వామిని వారు (యాజ్ఞవల్క్యాశ్రమాధిపతులు, యాచారం),
పూజ్యశ్రీ యోగిని చంద్రకాళీ ప్రసాద మాతాజీ వారు (కాళీవనాశ్రమాధిపతులు, నంబూరు),
శతావధాని శ్రీ ఆముదాల మురళిగారు (సంస్కృత లెక్చరర్, తిరుపతి).
డా॥ ద్వారం లక్ష్మి గారు, భక్తిరంజని,
సంగీతశాఖ ప్రొఫెసర్, పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం (తిరుపతి).
*************
విశేష కార్యక్రమములు:-
22-4-2024 సోమవారం గురుదేవుల అధిష్ఠానమందిరంలో శ్రీవారికభిషేకము, అర్చన;
23-4-2024 మంగళవారం ఆశ్రమవార్షికోత్సవము:-
శ్రీకాళహస్తిలో శ్రీగురుదేవుల పేరిటగల మూడు కళాశాలలలో సర్వప్రథమంగా వచ్చిన విద్యార్థులకు బహుమతుల ప్రదానము.
24-4-2024 బుధవారము త్రినేత్రవైద్యాలయం, భక్తకన్నప్ప ఉచిత కంటి ఆస్పత్రి వార్షికోత్సవము.
కార్యదర్శి నివేదిక : శ్రీ కె.ఈశ్వర్ గారు
కంటి ఆపరేషన్లు అయిన వారికి కంటి అద్దాల ప్రదానము. డాక్టర్లకు సన్మానము.
25-4-2024 గురువారము సద్గురు సర్వసేవాట్రస్టు వార్షికోత్సవము,
యోగాసనాల సర్టిఫికెట్ల ప్రదానము .
26-4-2024 శుక్రవారము శ్రీ గురుదేవుల జన్మదినోత్సవము
ఉదయం 10.30 గం॥లకు శ్రీవారిమూర్తికి అభిషేకము మరియు పాదుకాపూజ.
***********
ప్రతిరోజు కార్యక్రమములు:-
ఉదయం: 5.00గం||లకు సుప్రభాతము, ధ్యానము
5.30 - 6.00 మంత్రజపము
6.00 - 7.30 గం॥ల వరకు గీతాపారాయణము
9.00 - 11.00 గం||ల వరకు మహాత్ముల ప్రవచనములు
11.00 - 12.00 గం॥ల వరకు పూజ, హారతి.
మధ్యాహ్నం : 3.00 - 4.00గం||ల వరకు భజన, సంకీర్తన.
1. శ్రీసత్యసాయి సేవాసమితి వారి భజన (శ్రీకాళహస్తి),
2. చాముండీశ్వర భక్తబృందం వారి సంకీర్తన (భాస్కరపేట, శ్రీకాళహస్తి),
3. శ్రీహరినామ సంకీర్తన మండలి వారి భజన (పద్మశాలిపేట, శ్రీకాళహస్తి),
సాయంకాలం : 4.00-7.00 గం॥ల వరకు మహాత్ముల ప్రవచనాలు.
మహాత్ములకు సన్మానం
ఈ కార్యక్రమములో భక్తులందరు పాల్గొని ఆనందింతురుగాక!
ఓమ్ తత్సత్
ఇట్లు,
శ్రీ శుకబ్రహ్మాశ్రమ భక్తబృందము, ఆరాధనోత్సవ నిర్వహణ సమితి, శ్రీకాళహస్తి