Games

 

Services


                                                శ్రీ శుకబ్రహ్మఆశ్రమ సేవా కార్యక్రమాలు

1-త్రినేత్ర వైద్యాలయము-భక్త కన్నప్ప ఉచిత కంటి ఆసుపత్రి
2-గోశాల
3-అన్నదానం
4-గవర్నమెంట్ ఆర్ట్స్ & సైన్సు కాలేజీ(బాలురు)
5-గవర్నమెంట్ జూనియర్ కాలేజీ(బాలురు)
6-గవర్నమెంట్ జూనియర్ కాలేజీ(బాలికలు)
7-ఉచిత మెడికల్ క్యాంపు(ప్రతి నెల)


                                              ప్రసిద్ధ పుణ్యక్షేత్రమయిన తిరుపతి నుండి 40 కిలోమీటర్ల (K.M.) లో గల 
శ్రీ కాళహస్తీశ్వర దేవాలయానికి దక్షిణంగా ఒక కిలోమీటర్ దూరంలో స్వర్ణముఖినదీ తూర్పు తీరంలో అనేక ఫలవృక్షములతో నిండిన 40 ఎకరాల తోటలో శ్రీ శుకబ్రహ్మఆశ్రమం విరాజిల్లుతూ వుంది.

ఈ ఆశ్రమం 1950వ సంవత్సరంలో మాఘ శుద్ధ విదియ నాడు పరమహంస పరివ్రాజకాచార్య పూజ్య శ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారిచే స్థాపించబడినది.శ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాముల వారి గురుదేవులు ఆంధ్రప్రదేశము నందు అతి సుప్రసిద్ధ శ్రీ వ్యాసాశ్రమ సంస్థాపకులు పరమహంస పరివ్రాజకాచార్యులు అయిన పూజ్యపాద  శ్రీశ్రీశ్రీ అసంగానందగిరి స్వాములవారనే  శ్రీశ్రీశ్రీ సద్గురు మహర్షి మలయాళ స్వాముల వారిచే ఈ ఆశ్రమం ప్రారంభోత్సవం చేయబడినది.

1) పూజ్యశ్రీ  విద్యాప్రకాశానందగిరి స్వాములవారు తమ భూరి విరాళంతో 1966 సంవత్సరమున ఒక ప్రభుత్వ డిగ్రీ కళాశాలను  ప్రారంభింపచేసారు.
2) 1982లో ఒక ప్రభుత్వ జూనియర్ బాలికల కళాశాల ను శ్రీ కాళహస్తిలో ప్రారంభింపచేసారు.

3) 1993సం" లో నిరుపేదల నేత్ర చికిత్స కోసం "భక్త కన్నప్ప (త్రినేత్ర) ఉచిత కంటి వైద్య శాల" ను శ్రీ శుకబ్రహ్మఆశ్రమం లో ప్రారంభించారు. అది నేడు 30 పడకలతో నిరుపేదలకు ఉచిత సేవ చేస్తూంది. నేటివరకు(2015 JULY) ఈ వైద్యాలయంలో 19300 మందికి కంటి పొరల ఆపరేషన్ చేయబడి లెన్స్ అమర్చబడినవి. 2,08,000 మంది అవుట్ పేషెంట్(O.P.) లకు వివిధ కంటి చికిత్సలు చేయబడినవి. ప్రతి మంగళవారం గ్రామాలలో కంటి వైద్య క్యాంపు జరుగుచున్నది.ఈ ఆసుపత్రిలో ప్రస్తుతం డా:ప్రసన్నకుమార్ రెడ్డి గారు కంటి డాక్టర్ గా పనిచేస్తున్నారు. ఈ ఆసుపత్రిలో ఒక డాక్టర్, ఒక ఆప్తమాలజిస్టూ, ఇద్దరు నర్సులు, ఒక ఆయా వగైరా పనిచేస్తున్నారు.ఈ ఆసుపత్రిలో రోగులకు ఉచితముగా మందులు ఇచ్చి  చికిత్స చేయబడుతూంది. ఉచితముగా భోజనాలు పెట్టబడుతున్నవి.


4) సద్గురు సర్వసేవా ట్రస్టు:
సమాజసేవ చేయటానికి ఇప్పటి పీఠ అధిపతులు అయిన పూజ్యశ్రీ విద్యాస్వరూపానందగిరి స్వాములవారిచే 
శ్రీ శుకబ్రహ్మఆశ్రమము లో "సద్గురు సర్వసేవా ట్రస్టు"2003 సంవత్సరంలో రిజిస్టర్ చేయబడినది.
a)  ఈ ట్రస్ట్ ద్వారా ప్రస్తుతం నిరుపేదలగు వృద్దులకు సేవ చేయడానికి ఒక వృద్దాశ్రమం ఏర్పాటు చేయబడినది. దాని నిర్మాణానికి 20లక్షల రూపాయలు విరాళం ఇచ్చు వారి పేరిట ఒక బ్లాకు నిర్మించబడును. లక్ష రూపాయలు ఆపైన ఇచ్చిన వారికి పేరు శిలాఫలకం పై చెక్కబడును. ఒక లక్ష రూపాయలు నిధిగా ఇచ్చిన వారి పేరును శిలాఫలకం పై చెక్కబడును, అలాగే నిధిగా వుంచి దాని వడ్డీ ఒక వృద్ధుని సేవకు వినియోగింపబడును.
b) "గీతాభవనం" ఆశ్రమంలో నిర్మించాలని పూజ్య గురుదేవుల సంకల్పం, దాని నిర్మాణానికి 60 లక్షల రూపాయలు ఖర్చగును, దీనికోసం ఒక లక్షరూపాయలు లేదా అంతకుమించి ఇచ్చువారి పేరు శిలాఫలకం పై చెక్కబడును.
c) కొన్ని కుగ్రామాలను ఎన్నిక చేసుకొని అచట మెడికల్ క్యాంపు ఏర్పాటు చేసి ఆ గ్రామీణ ప్రజలకు ఉచిత వైద్య సేవ చేయబడుతుంది. దాని మూలనిధికి  ఉదారులు ధన సహాయము చేయ వచ్చును.
d) అన్నదానం:  ఆశ్రమానికి వచ్చు భక్తులకు, కంటి ఆస్పత్రి రోగులకు, ఆశ్రమంలో వుండు సాధుసత్పురుషులకు నిత్య భోజనప్రసాదములు  ఏర్పాటు చేయబడినవి. ఈ నిత్యాన్నదాన నిధికి 15,000/- రూపాయలు ఇచ్చిన వారిపేరిట  వడ్డీతో సంవత్సరానికి ఒక పూట భోజనప్రసాదము  పెట్టబడును. 25,000/- రూపాయలు ఇచ్చిన వారి పేరిట రెండు పూటల భిక్ష(భోజనప్రసాదము) పెట్టబడును.

5) గోశాల:  ఆశ్రమంలో ఒక గోశాల కలదు, అందలి గోమాతల  పోషణకు మూలనిధిగా 10,000/- రూపాయలు అంతకు మించి ఇచ్చు వారి పైకాన్ని నిధిగా వుంచి దాని వడ్డీ గోమాతల పోషణకు వినియోగింపబడును.


6) వేదాంతభేరి నిధి:  వేదాంతభేరి మాసపత్రిక పోషణకుగాను శాశ్వత నిధి ఏర్పాటు చేయబడింది.
పోషకులు--------------------- రూ:3,000/-
రాజపోషకులు---------------- రూ:5,000/-
మహాపోషకులు------------- రూ:10,000/-

ప్రాణధారులు----------------- రూ:25,000/-
పై పైకం ఇచ్చువారి ఫోటో పత్రికలో ఒకమారు ప్రచురించబడి పత్రిక ఉన్నంత కాలం వారికి పత్రిక పంపబడును.