Games

 

19 Nov 2017

గీతామకరందము-01-10

3 comments
01-10-గీతా మకరందము.
        అర్జునవిషాదయోగము
    
      -పూజ్యశ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారు,
శ్రీశుకబ్రహ్మాశ్రమము, శ్రీకాళహస్తి.

అ||  ఇవ్విధముగ తన పక్షమునగల శూరులను పొగడి తదుపరి దుర్యోధనుడు రెండువైపుల గల సేనలను లెక్కగట్టి తన సైన్యమే చాల గొప్పదని నుడువుచున్నాడు –

అపర్యాప్తం తదస్మాకం 
బలం భీష్మాభిరక్షితమ్
పర్యాప్తం త్విదమేతేషాం 
బలం భీమాభిరక్షితమ్.

తా:- అట్టిశూరులుకల మనసైన్యము భీష్మునిచే గాపాడ బడుచు అపరిమితముగ నున్నది. (అజేయమై యొప్పుచున్నది). పాండవులయొక్క ఈ సేనయో భీమునిచే రక్షింపబడుచు పరిమితముగనున్నది. (జయింప శక్యమైయున్నది.)

వ్యాఖ్య:- ఈ శ్లోకములోని 'అపర్యాప్తం', 'పర్యాప్తం' అను పదముల యర్థమందు భాష్యకారులలో మతభేదము కన్పట్టు చున్నది. ఆనందగిరి, శంకరానందులు మున్నగువారు 'అపర్యాప్త’ పదమునకు అపరిమితమను అర్థమును సూచించిరి. శ్రీధరులు మున్నగువారు అసంపూర్ణము, అసమర్థము అను భావమును ప్రకటించిరి. కాని యిందు మొదటియర్థమే సమీచీనముగ తోచుచున్నది. ఏలననగా దుర్యోధను డిదివఱలో ఉద్యోగపర్వమందు ధృతరాష్ట్రునితోను (ఉ.54–60-70), భీష్మపర్వమున ద్రోణాచార్యునితోను (భీష్మ 51-4-6) తన సైన్యముయొక్క గొప్పతనమును గూర్చి మిక్కుటముగ శ్లాఘించి యుండెను. వారలను ఉత్సాహపరుచు నిమిత్త మావిధముగ నతడు చెప్పి యుండెను. ఇపుడును అదియే సందర్భము కనుక, మఱియొక విధముగ నాతడు చెప్పియుండడు. తన సైన్యమును కించపఱచుకొను అవకాశ మిచట లేదు. శ్లోకము యొక్క ధోరణి స్వపక్షమును కీర్తించునదిగనే యున్నది. కావున "మన సైన్యము చాలకున్నది. పాండవ సైన్యము పరిపూర్ణముగనున్నది' అను నర్థ మిచట సందర్భోచితముగా లేదు. తన సైన్యమును శ్లాఘించుచు భీష్మపర్వమున (51-6) ఇదియే శ్లోకమును దుర్యోధనుడు ద్రోణాచార్యునకు చెప్పినవిషయమున్ను ఇచట గమనించ దగియున్నది.

" భీమాభిరక్షితమ్' - కౌరవసేనకు భీష్ముడధిపతియై యున్నట్లు, పాండవసేనకు ధృష్టద్యుమ్ను డధిపతియై యుండ, ఇట " భీమునిచే రక్షింపబడిన పాండవసేన" అని యేల చెప్పబడినది? ఇందులకు కారణము లివియైయుండ వచ్చును - 
(1)భీముడు ధార్తరాష్ట్రులనందఱిని వధించుటకు కృతనిశ్చయుడై యున్నందున దుర్యోధనుని చిత్తమున అతడే స్ఫురించియుండవచ్చును. 
(2)ధృష్టద్యుమ్నుడు పాండవసేనకు నాయకుడుగ నియమింపబడినను, సేననంతను కాపాడుచుండుటకు భీముడుకూడ నియోగింపబడెను. 
(3)మొదటి దినమున పాండవులచే రచింపబడిన వజ్రవ్యూహముయొక్క రక్షణ కొఱకు దాని యగ్రభాగమునందు భీముడుండెను. కావున సేనారక్షకుడుగ నాతడే దుర్యోధనునకు గన్పట్టియుండవచ్చును.

3 comments:

Unknown said...

Very informative

Sri suka brahma ashram said...

Hari om,
Have u listened
Gurudev
SWAMY VIDYA PRAKASHANANDA MAHARAJ's,
(SRI SUKA BRAHMA ASHRAM, SRIKALAHASTI)
Gita speeches {video/audio}?!

శ్రీ గురుదేవులు
పూజ్యశ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారి
(శ్రీశుకబ్రహ్మాశ్రమము, శ్రీకాళహస్తి.)
గీతాప్రసంగాలు (ఆడియో/వీడియో)విన్నారా?!

Or shall I send (Memory card/DVDs/PENDRIVE)?!
Pl reply.
8106851901
----------

Sri suka brahma ashram said...

Hari om,
Have u listened
Gurudev
SWAMY VIDYA PRAKASHANANDA MAHARAJ's,
(SRI SUKA BRAHMA ASHRAM, SRIKALAHASTI)
Gita speeches {video/audio}?!

శ్రీ గురుదేవులు
పూజ్యశ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారి
(శ్రీశుకబ్రహ్మాశ్రమము, శ్రీకాళహస్తి.)
గీతాప్రసంగాలు (ఆడియో/వీడియో)విన్నారా?!

Or shall I send (Memory card/DVDs/PENDRIVE)?!
Pl reply.
8106851901
----------

Post a Comment