Games

 

15 May 2016

నీవూ దేవుడే!

0 comments
నీవూ దేవుడే!
-అని వేదాలు , శాస్త్రాలు అన్నీ ముక్తకంఠముతో ఘోషిస్తున్నాయి.
తత్త్వమసి.
Thou art That.
దేహాదులు మాత్రమే తాను అనుకుంటే జీవుడు ;
సచ్చిదానంద ఆత్మ తాను అనుకుంటే దేవుడు.
కనుక తాను జీవుడా లేక దేవుడా అనునది తన అనుభవములోనే తెలియగలదు.
ఎవరి స్మరణమాత్రముచే శాంతి, ఆనందము, దుఃఖనివృత్తి కలుగుతాయో వారు దైవము కాక మరెవరు?!
ఒకానొక పక్షికి(దివాంధమునకు) పగలు చీకటిగా యుంటుంది. అంత మాత్రము చేత సూర్యుడు ప్రకాశరహితుడు అని ఎలా నిర్ణయించగలరు?!
అవజానన్తి మామ్ మూఢాః - అని గీతలో చెప్పినట్లు - కొందరు ఒప్పుకోనంతమాత్రము చేత దేవుడు  దేవుడు కాకుండాపోరు.
శ్రీ శంకరులు తెలిపినట్లు ఆత్మజ్ఞానము పొందిన వారందరు -చిదానంద రూపః శివో2హం శివో2హం.

   దేవుడు అంటే ఎవరని గీతలో అర్జునుడు సాక్షాత్ శ్రీ కృష్ణదేవునే ప్రశ్నించాడు.
అందులకు గీతాచార్యులు-
నాశరహితమయిన తత్త్వమే దేవుడు, 
"అక్షరం బ్రహ్మ పరమం " అని గీత 8వ అధ్యాయములో సెలవిచ్చినారు. 
అనన్యభక్తి ద్వారా జీవుడు ఆ అక్షరపరమాత్మతో ఐక్యమై దేవుడే కాగలడు. 
  అంతేకాని ఒకరు దేవుడా , కాదా - అను వృథా కాలయాపనకు , వాదనలకు అవకాశమివ్వక భక్తి ,ధ్యానాది సాధనచేసి తాను కూడా దైవానందమును , ఆత్మానందమును పొందుటకు ప్రయత్నించి కృతార్థుడు కావలసి యున్నది.

శ్రీ గురుదేవులు తత్త్వసారము నందు ఇలా బోధించినారు-
  జీవ బ్రహ్మలు ఏకమేరన్నా,
వారి ఐక్యము, తెలిసి బంధము
                        పారద్రోలన్నా,
పొట్టు యుండిన వడ్లగింజ ,
పొట్టు ఊడిన బియ్యమేను .
పాశబద్ధుడు   జీవుడగును ,
పాశముక్తుడు పరమశివుడే .
తత్త్వసారము తెలుసుకోరన్నా ,
సద్గురుని చెంత, నిజము   
         కనుగొని లాభమొందన్నా .
    కావున జీవుడు గురుభక్తి , దైవభక్తి , దైవసేవ , జప ,ధ్యాన , ఆత్మవిచారణ గావించి అజ్ఞానపాశవిముక్తుడై  దైవస్వరూపుడై , పరమానందరూపుడై విరాజిల్ల వలెను.
ఓమ్

0 comments:

Post a Comment