Games

 

25 Jul 2015

గీతా సారం

2 comments
                                                             గీతా సారం



భగవద్గీత చివర అధ్యాయంలో శ్రీకృష్ణ పరమాత్మ గీతా ప్రబోధమునంతను క్రోడీకరించి సంక్షేపముగా మూడు శ్లోకములలో చెప్పిరి. పరబ్రహ్మ సాక్షాత్కారమును జీవుడేవిధముగా పొందగలడో ఆ సాధనలు వాని యందు చక్కగా వివరింపబడినవి. కావున ముముక్షువు ఆ శ్లోకములను నిరంతరం మననం చేయుచుందుట శ్రేయస్కరము.

1. బుద్ధ్యావిశుద్ధయా యుక్తో ధృత్యాత్మానం నియమ్య చ
 శబ్దాదీన్విషయాం  త్యక్త్వా రాగద్వేషౌ  వ్యుదస్య చ         (18-51)
2. వివిక్త సేవీ లఘ్వాశీ యతవాక్కాయమానసః
ధ్యానయోగపరో నిత్యం వైరాగ్యం సముపాశ్రితః               (18-52)
౩.  అహంకారం బలం దర్పం కామం క్రోధం పరిగ్రహం
విముచ్య నిర్మమః శాన్తో బ్రహ్మభూయాయ కల్పతే.        (18-53)

నిర్మల బుద్ధితో గూడి, ధైర్యముతో మనస్సును స్వాదీనపరచుకొని, శబ్దాది విషయములను, రాగద్వేషములను విడిచిపెట్టి, ఏకాంతవాసియై, మితాహారమును స్వీకరించుచు, శరీర వాక్  మనంబులను నియమించి, నిరంతరం ధ్యానయోగాభ్యాస మొనర్చుచు, వైరాగ్యమును లెస్సగా ఆశ్రయించి, అహంకార బలదర్పములను, కామక్రోధములను, భోగ్యవస్తు పరిగ్రహమును బాగుగా త్యజించివైచి, మమకార రహితుడవై, శాంతస్వభావం గలిగియుండు  మహనీయుడు పరబ్రహ్మ సాక్షాత్కారము పొందుటకు సమర్థుడు అగుచున్నాడు.

2 comments:

Unknown said...

entire Bhagavat Gita is summed up in these three slokas. so these are very important to remember and to recapitulate for ever.

Katakam Veerabhadra Rao said...

శ్రీ కృష్ణ పరమాత్మ తెలిపిన ఈ మూడు శ్లోకాలలోని సారాంశం గ్రహించి ఆచరించినచో మానవులంతా మహానీయులుగా మారతారనటంలో ఎటువంటి సందేహం లేదు.

Post a Comment